మాటిచ్చాడు...మర్చిపోయాడు! | Is Salman Khan finally growing old? | Sakshi
Sakshi News home page

మాటిచ్చాడు...మర్చిపోయాడు!

Jan 19 2014 12:13 AM | Updated on Apr 3 2019 6:23 PM

మాటిచ్చాడు...మర్చిపోయాడు! - Sakshi

మాటిచ్చాడు...మర్చిపోయాడు!

‘‘మనిషిలా ఉండు.. ఇతరులకు సహాయం చెయ్యి’’ అని చెబుతున్నట్లుగా తన సేవాసంస్థకు ‘బీయింగ్ హ్యూమన్’ అని పేరు పెట్టుకున్నారు సల్మాన్‌ఖాన్.

 ‘‘మనిషిలా ఉండు.. ఇతరులకు సహాయం చెయ్యి’’ అని చెబుతున్నట్లుగా తన సేవాసంస్థకు ‘బీయింగ్ హ్యూమన్’ అని పేరు పెట్టుకున్నారు సల్మాన్‌ఖాన్. ఈ సంస్థద్వారా పలు సేవాకార్యక్రమాలు చేస్తుంటారాయన.సహాయం చేస్తానని ఎవరికైనా మాటిస్తే.. అది నెరవేర్చుకుంటారట. కానీ, ఒక ప్రొఫెసర్ విషయంలో మాత్రం సల్మాన్ మాట తప్పారు. వెనకబడిన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేయాలనే సదాశయంతో ఆ ప్రొఫెసర్ నిధి సమకూర్చుకుంటున్నారు. దీనికోసం చర్చ్ గేట్ నుంచి గుర్గావ్ వరకు ప్రతిరోజూ ఆరు గంటలు రైలు ప్రయాణం చేస్తుంటారాయన.
 
 2010లో ఓ సందర్భంలో సల్మాన్‌ఖాన్ కంటపడ్డారు. ఆయన్నుంచి విషయం మొత్తం తెలుసుకుని ‘నేను సహాయం చేస్తా’ అని మాటిచ్చేశారు సల్మాన్‌ఖాన్. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా ఇంకా సహాయం అందలేదని, సల్మాన్ ఈ విధంగా చేయడం బాధపెట్టిందని  ఇటీవల ఆ ప్రొఫెసర్ బహిరంగంగా పేర్కొన్నారు. ఈ విషయం సల్మాన్ వరకు వెళ్లింది. పనుల ఒత్తిడితో మర్చిపోయానని, జరిగిన పొరపాటుకి బాధపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, త్వరలో ప్రొఫెసర్‌ని కలిసి, సహాయం చేయబోతున్నామని సల్మాన్ మేనేజర్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement