వెండితెర గ్రౌండ్‌లో...

Irfan Pathan, Harbhajan Singh to debut in Tamil cinemas - Sakshi

గ్రౌండ్‌లో బంతులను బ్యాట్స్‌మెన్‌  వైపు విసురుతుంటారు క్రికెటర్స్‌ హర్బజన్‌ సింగ్, ఇర్ఫాన్‌ పటాన్‌. ఇప్పుడు ఈ ఇద్దరు ఇండియన్‌ బౌలర్లు రూటు మార్చారు. తమిళ సినిమాల్లో కీలక పాత్రల్లో ఈ ఇద్దరూ నటించబోతున్నట్టు ప్రకటించారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఇర్ఫాన్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అలాగే కమెడియన్‌ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘డిక్కీలోనా’. ఈ సినిమాలో హర్బజన్‌ నటిస్తున్నారు. గ్రౌండ్‌లో వికెట్లు తీసిన ఈ బౌలర్స్, థియేటర్స్‌లో టికెట్లు ఎలా తెంపిస్తారో వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top