‘వ్యోమగామి’గా మెగా హీరో | Intresting Title For Varun Tej And Sankalp Reddy Film | Sakshi
Sakshi News home page

May 12 2018 11:07 AM | Updated on May 12 2018 11:07 AM

Intresting Title For Varun Tej And Sankalp Reddy Film - Sakshi

ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

తెలుగులో తొలి స్పేస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. వరున్‌ ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వ్యోమగామి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నటించేందుకు వరుణ్‌ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్‌ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్‌ వేస్తున్నారు. వరుణ్‌ సరసన అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌(దర్శకుడు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement