నాగ్ టైటిల్తో చైతూ మూవీ..? | intresting title for naga chaitanyas next | Sakshi
Sakshi News home page

నాగ్ టైటిల్తో చైతూ మూవీ..?

Sep 4 2016 9:06 AM | Updated on Jul 15 2019 9:21 PM

నాగ్ టైటిల్తో చైతూ మూవీ..? - Sakshi

నాగ్ టైటిల్తో చైతూ మూవీ..?

కింగ్ నాగార్జున కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో నిన్నే పెళ్లాడతా ఒకటి. నాగార్జున, టబు జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించటంతో పాటు నాగ్కు రొమాంటిక్ హీరో ఇమేజ్ను...

కింగ్ నాగార్జున కెరీర్లో  చెప్పుకోదగ్గ సినిమాల్లో నిన్నే పెళ్లాడతా ఒకటి. నాగార్జున, టబు జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించటంతో పాటు నాగ్కు రొమాంటిక్ హీరో ఇమేజ్ను సుస్థిరం చేసేసింది.  అయితే ఇప్పుడు ఇదే పేరుతో నాగార్జున వారసుడు నాగచైతన్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చైతన్య, సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు నిన్నేపెళ్లాడతా అనే టైటిల్ను పెట్టాలని భావిస్తున్నారట. నిన్నే పెళ్లాడతా సినిమాకు రీమేక్ కాకపోయినా, సినిమాకు ఆ టైటిల్ పెడితే మంచి హైప్ క్రియేట్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement