సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..? | Intresting Title for Mahesh babu Koratala siva film | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

Nov 1 2016 11:20 AM | Updated on May 10 2018 12:13 PM

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..? - Sakshi

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత తను చేయబోయే సినిమాను అప్పుడే లైన్లో పెట్టేశాడు...

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత తను చేయబోయే సినిమాను అప్పుడే లైన్లో పెట్టేశాడు మహేష్. తనకు శ్రీమంతుడు లాంటి బిగెస్ట్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే కథ కూడా పైనల్ అయిన ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారంటూ ప్రచారం మొదలైంది. ఈ సినిమాకు 'భరత్ అను నేను' అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో మహేష్ బాబు రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఆ ప్రచారానికి మరింత బలాన్నిస్తూ ప్రమాణ స్వీకార సమయంలో చెప్పే మాటలనే టైటిల్గా ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

దూకుడు సినిమాలో మహేష్ బాబు కొద్ది సేపు వైట్ అండ్ వైట్లో ఎమ్మెల్యేగా కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు సినిమా కూడా ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సారి మహేష్ పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్గా నటిస్తే మరోసారి రికార్డ్లు తిరగరాయటం కాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. నిజంగానే తన నెక్ట్స్ సినిమాలో మహేష్ పొలిటీషియన్ కనిపిస్తాడా..? అసలు విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement