‘హే మీరిద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్‌ అవ్వొచ్చు కదా’

Internet Wants Katrina Kaif And Anushka Sharma Be Best Friends - Sakshi

బయట సంగతి ఏమో కానీ సిని పరిశ్రమలో ఇద్దరు టాప్‌ హీరోయిన్లు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉండటం చాలా అరుదు. అయితే అందుకు మేము విరుద్ధం అంటున్నారు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌. వీరిద్దరూ షారు​క్‌ ఖాన్‌ ‘జీరో’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో భాగంగా కత్రిన, అనుష్కతో కలిసి దిగిన ఫోటోను తన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటో అభిమానులను ఫిదా చేసింది. దాంతో ‘మీరు ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయితే చాలా బాగుంటుందం’టూ కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు. షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 8 లక్షల మంది ఈ ఫోటోను లైక్‌ చేశారు.


🦋Zero promotions 🌟 ❤️ @anushkasharma

A post shared by Katrina Kaif (@katrinakaif) on

అనుష్క కూడా కత్రినాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ ‘లవ్‌ దిస్‌ గర్ల్‌’, ‘వి లైక్‌ టూ టాక్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. 2012లో వచ్చిన ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ చిత్రంలో తొలిసారి కత్రినా, అనుష్క ఇద్దరు కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహాం చిగురించింది కూడా షారుక్‌ ఖాన్‌ చిత్రంలోనే కావడం గమనార్హం. జబ్‌ తక్‌ హై జాన్‌లో షారుక్‌ ఖాన్‌ హీరో అన్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top