రజనీని మించిపోయూడట | Interesting Facts Revealed At Anegan Audio Launch | Sakshi
Sakshi News home page

రజనీని మించిపోయూడట

Nov 11 2014 2:13 AM | Updated on Oct 2 2018 3:40 PM

సినీ ప్రపంచంలో స్టయిల్ కింగ్ అంటే ఇప్పటి వరకు సూపర్‌స్టార్ రజనీకాంత్.


సినీ ప్రపంచంలో స్టయిల్ కింగ్ అంటే ఇప్పటి వరకు సూపర్‌స్టార్ రజనీకాంత్. అయితే ఇప్పుడాయన్ని ఆయన అల్లుడు యువ నటుడు ధనుష్ మించిపోయూరని సీనియర్ దర్శకుడు ఆర్.వి.ఉదయకుమార్ వ్యాఖ్యానించడం విశేషం. ధనుష్ నటించిన తాజా చిత్రం అనేగన్. కెవి.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ అమిర దస్తూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ధనుష్ నాలుగు పాత్రల్లో నటించగా సీనియర్ నటుడు కార్తీక్ ముఖ్య పాత్రను పోషించారు.

హరిష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణఆదివారం సాయంత్రం స్థానిక విల్లివాక్కంలోని ఏజీఎస్ సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. ఆడియోను నిర్మాతలు కల్పాత్తి అగోరం, గణేశ్‌లు ఆవిష్కరించగా, చిత్ర యూనిట్ తొలి ప్రతిని అందుకుంది. దీనికి అతిథిగా హాజరైన సీనియర్ దర్శకుడు ఆర్‌వి ఉదయకుమార్ మాట్లాడుతూ, అనేగన్ అంటే అందరిలో ఒక్కడు అని అర్థమని చెప్పారు. ఇలాంటి మంచి పేర్లతో చిత్రాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు కెవి ఆనంద్‌ను అభినందించాలన్నారు. అలాగే కార్తీక్ తాను కలిసి చేసిన పలు చిత్రాలు విజయం సాధించాయన్నారు. ఆయన తన పాత్రకు ప్రాముఖ్యత లేకుంటే ఈ చిత్రంలో నటించేవారు కాదన్నారు.

హీరో ధనుష్ గురించి చెప్పాలంటే ఇటీవల ఆయన నటించిన వెల్లై ఇలాద పట్టాదారి చిత్రం చూశానన్నారు. అందులో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయానన్నారు. స్టరుుల్‌లో రజనీకాంత్‌ను మించిపోయారన్నారు. ధనుష్ ఒక పక్క మాస్ క థా చిత్రాలు, మరో పక్క ప్రేమ కథా చిత్రాలు అంటూ బ్యాలెన్స్‌గా చేసుకుంటూ పోతున్నారని అభినందించారు. నటనలోను కమల్ హాసన్‌ను మరిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఏదో ఆశించి ఇలా చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో రజనీకాంత్ ఏమయినా రియాక్ట్ అయితే తాను చూసుకుంటానని అన్నారు.

ధనుష్ కష్టాల్లో నుంచి వచ్చిన నటుడు అని ఏ పాత్రకు ఎలా అభినయించాలో ఆయనకు బాగా తెలుసునని ఆర్‌వి ఉదయకుమార్ అన్నారు. కెవి ఆనంద్ తనతో చాలా భారీ చిత్రాన్ని తెరకెక్కించారని అందుకు ఏజీఎస్ సంస్థ అధినేతలు ఎంతగానో సహకరించారని చిత్ర హీరో ధనుష్ పేర్కొన్నారు. అదే విధంగా ఈ చిత్రంలో నటిస్తుండగా హిందీ చిత్రం షమితాబ్‌లో నటించే అవకాశం వచ్చిందని అది కూడా చాలా మంచి కథా చిత్రం అని అన్నారు. అలాంటి చిత్రంలో నటించడానికి దర్శకుడు కేవీ ఆనంద్ డేట్స్ సర్దుబాటు చేయడం వల్లే సాధ్యం అయ్యిందని అన్నారు. నటుడు కార్తీక్‌తో నటించడం చాలా మంచి అనుభవం అని పేర్కొన్నారు. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించానని లేకపోతే ఆయన ముందు తాను కనిపించకుండా పోయే వాడినని ధనుష్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement