పొలిటికల్‌ పంచ్‌ | Indian 2 will talk about present politics, reveals Kamal Haasan | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ పంచ్‌

May 22 2018 1:51 AM | Updated on May 22 2018 1:51 AM

Indian 2 will talk about present politics, reveals Kamal Haasan - Sakshi

దర్శకుడు శంకర్, హీరో కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) లంచాలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ తాత లంచగొండులందర్నీ క్లీన్‌ చేశారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ‘ఇండియన్‌ 2’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌లో ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలపై దృష్టి పెట్టారని చెన్నై టాక్‌. ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్‌ అన్నింటినీ డైరెక్ట్‌గా అటాక్‌ చేయకుండా సెటిల్డ్‌గా ప్రస్తావించనున్నారని సమాచారం. కమల్‌హాసన్‌  పూర్థి స్థాయి పాలిటిక్స్‌లోకి వెళ్లే లోపు ఈ మూవీని కంప్లీట్‌ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం తమిళ్‌లో ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 2’ హోస్ట్‌ చేస్తున్న కమల్‌ హాసన్‌ ఈ షో కంప్లీట్‌ అవ్వగానే ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో ఆగిపోయిన కమల్‌ ‘విశ్వరూపం 2’  సెన్సార్‌ పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement