ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై గురువారం మెరుపు దాడులు చేశారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై గురువారం మెరుపు దాడులు చేశారు. చెన్నైలో ఒకే సమయంలో 29 మంది నిర్మాతలు, నటుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన ఏఎమ్ రత్నం, ఆర్బీ చౌదరి ఇళ్లను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. జ్ఞానవేలు రాజా, హాస్య నటుడు సంతానం తదితర ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఒకేసారి ఇంతమంది ప్రముఖల ఇళ్లను సోదా చేయడం గమనార్హం. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది.