నేను రోబో కాదు | Im Not a Robot Says Alia Bhatt | Sakshi
Sakshi News home page

నేను రోబో కాదు

Mar 16 2020 4:10 AM | Updated on Mar 16 2020 4:10 AM

Im Not a Robot Says Alia Bhatt - Sakshi

‘‘రోజులో ఎంత బిజీగా ఉన్నా మనకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి’’ అంటున్నారు ఆలియా భట్‌. ఈ విషయం గురించి ఇంకా వివరంగా చెబుతూ – ‘‘ఎప్పుడూ పని పని అంటూ ఓ రోబోలా మెకానికల్‌గా ఉండటం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగత జీవితం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాను. ప్రతి రోజూ నా గురించి నేను కొంత ఆలోచించుకుంటాను. ఇందుకోసం టైమ్‌ కేటాయించుకుంటాను. అలా చేయడం వల్ల రీచార్జ్‌ అవుతాను. నేటి బిజీ లైఫ్‌లో మన కోసం కొంచెం టైమ్‌ తీసుకోవాలి. అలాగే కొందరు ఇతరులకు నచ్చేలా ఉండటం కోసం తమకు ఇష్టం లేని లుక్స్‌ని ట్రై చేస్తుంటారు. నేను అలా చేయను. ఎందుకంటే ముందు మనకు మనం నచ్చినప్పుడే ఇతరులకు నచ్చుతామని నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చారు ఆలియా. 

Advertisement
 
Advertisement
Advertisement