ఆ ఇద్దరితోనూ చనువుంది: దీపిక | I'm comfortable with both Ranveer Singh and Ranbir Kapoor, says Deepika Padukone | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితోనూ చనువుంది: దీపిక

Dec 14 2015 3:58 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆ ఇద్దరితోనూ చనువుంది: దీపిక - Sakshi

ఆ ఇద్దరితోనూ చనువుంది: దీపిక

బాలీవుడ్‌లో దూకుడు మీద ఉన్న టాప్‌ హీరోయిన్‌ దీపిక పదుకొణె. ఇటీవలే ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో జట్టుకట్టి 'తమాషా' సినిమాను రక్తి కట్టించింది.

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో దూకుడు మీద ఉన్న టాప్‌ హీరోయిన్‌ దీపిక పదుకొణె. ఇటీవలే ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో జట్టుకట్టి 'తమాషా' సినిమాను రక్తి కట్టించింది. తన చెలికాడు రణ్‌వీర్‌సింగ్‌తో 'బాజీరావు మస్తానీ' వంటి భారీ చారిత్రక సినిమాతో ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఒకేసారి వీరిద్దరితో తెరపంచుకున్న విషయమై స్పందిస్తూ తనకు వారిద్దరితోనూ చనువు ఉందని దీపిక తెలిపింది.

అయితే రణ్‌వీర్‌తో 'బాజీరావు మస్తానీ' ప్రమోట్‌ చేయడం.. రణ్‌బీర్‌తో 'తమాషా' ప్రమోట్‌ చేయడం కన్నా భిన్నమైందని అభిప్రాయపడింది. 'ఒక్క నెల గ్యాప్‌ కూడా లేకుండా వరుసగా నీ సినిమాలు రెండు రానున్నాయి. పని ఒత్తిడితో నువ్వు నీరసించిపోతావని చాలామంది చెప్పారు. కానీ రణ్‌వీర్‌ సింగ్‌ను చూడండి. అతను నన్ను పెద్దగా మాట్లాడనియ్యడు. తనే మొదట గొంతు విప్పుతాడు. నాకు ఇదెంతో మంచి విషయం. ఇక రణ్‌బీర్‌ కపూర్‌ విషయానికొస్తే. అతను అంతగా మాట్లాడలేడు. అప్పుడు ఆ బాధ్యత నాది అవుతుంది. అందుకు భిన్నంగా 'బాజీరావు మస్తానీ' ప్రమోషన్‌లో నాకోసం ముందుగా గొంతు విప్పేది రణ్‌వీర్‌సింగే' అని దీపిక వివరించింది.

'వాళ్లిద్దరితోనూ నాకు చనువుంది. పరిస్థితులను బట్టి ఇది ఉంటుంది. అందుకు అనుగుణంగా నేను వ్యవహరిస్తాను' అని చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాలతో రూపొందిన 'బాజీరావు మస్తానీ' సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా భన్సాలీ ఎమోషనల్‌ డ్రామాతోపాటు యాక్షన్‌, రోమాన్స్, కామెడీ, పాటలు వంటి సినిమా దినుస్సులన్నీ పుష్కలంగా ఉంటాయని ఆమె చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement