సైఫ్‌ ఆలీఖాన్‌తో గోవా భామ ఎంజాయ్! | ileana enjoyed with saif ali khan | Sakshi
Sakshi News home page

సైఫ్‌ ఆలీఖాన్‌తో గోవా భామ ఎంజాయ్!

Jan 4 2014 9:41 PM | Updated on Sep 2 2017 2:17 AM

సైఫ్‌ ఆలీఖాన్‌తో  గోవా భామ ఎంజాయ్!

సైఫ్‌ ఆలీఖాన్‌తో గోవా భామ ఎంజాయ్!

గోవా బ్యూటీ ఇలియానా హిట్లుమీద హిట్లు కొడుతోంది. టాలీవుడ్లో ఓ వెలుగువెలిగి ఆ తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది మొదలు హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది.


గోవా బ్యూటీ ఇలియానా హిట్లుమీద హిట్లు కొడుతోంది.  టాలీవుడ్లో ఓ వెలుగువెలిగి ఆ తరువాత బాలీవుడ్‌లో  అడుగుపెట్టింది మొదలు హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. బర్ఫీ మూవీతో బెస్ట్‌ డెబ్యూగా అవార్డు సంపాదించుకుంది.   తెలుగులో దేవదాస్‌  చిత్రంతో  ఎంట్రీ ఇచ్చి ఇలియానా టాప్‌ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది.  తర్వాత పోకిరి.  సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇక చెప్పేదేముంది.  దాంతో హవా కొనసాగించింది. అయితే ఇటీవల ఇలియానాకు తెలుగులో  అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఈ నాజూకు నడుం భామ బాలీవుడ్‌పై కన్నేసింది.

బాలీవుడ్లో అడుగుపెట్టడంపెట్టడంతోనే  సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టింది.  ఇలియానా తొలిసారిగా హిందీలో నటించిన బర్పీ చిత్రంతో  మంచి పేరు మూటకట్టుకుంది.  అయితే ఈ సినిమా హిట్‌ అయినప్పటికీ ఇందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవు. మాస్‌ మసాలాలు లేవు. దాంతో ఇది  కిందిస్థాయి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  ఆ తరువాత ఈ సుందరి జాగ్రత్తలు పాటించడం మొదలు పెట్టింది.  పూర్తి కమర్షియల్‌ సినిమాల మాత్రమే  ఓకే చేప్పడం మొదలు పెట్టింది. అటువంటివాటిలో  హ్యాపీ ఎండింగ్ ఒకటి‌. ఈ చిత్రంలో ఇలియానా సైఫ్‌ఆలీఖాన్‌తో జతకడుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ లండన్‌లో జరుగుతోంది. సైప్, ఇలియానా మధ్య కెమిస్ట్రి బాగా కుదిరినట్లు చెబుతున్నారు.

లండన్  షెడ్యూల్‌లో ఇలియానా  సైఫ్‌ ఆలీఖాన్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఎంజాయ్ అంటే వేరేలా అర్ధం చేసుకోకండి. అదేనండి పార్కులు చుట్టూ తిరగడం, డిన్నర్లలో పాల్గొనడం.... వంటివండి. ఆ తరువాత సైఫ్‌ జంటిల్‌మేన్‌ అని కితాబు కూడా ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement