ఇలియానా మాట మార్చింది: గౌరంగ్ | Ileana D'Cruz had agreed to be part of Aankhen 2: Gaurang Doshi | Sakshi
Sakshi News home page

ఇలియానా మాట మార్చింది: గౌరంగ్

Aug 19 2016 11:37 PM | Updated on Sep 4 2017 9:58 AM

ఇలియానా మాట మార్చింది: గౌరంగ్

ఇలియానా మాట మార్చింది: గౌరంగ్

గడచిన రెండు రోజులుగా ముంబైలో ‘ఆంఖే 2’ చిత్రం గురించే అందరి చర్చ. ‘ఆంఖే’కి సీక్వెల్‌గా అనీస్ బజ్మీ దర్శకత్వంలో

గడచిన రెండు రోజులుగా ముంబైలో ‘ఆంఖే 2’ చిత్రం గురించే అందరి చర్చ. ‘ఆంఖే’కి సీక్వెల్‌గా అనీస్ బజ్మీ దర్శకత్వంలో గౌరంగ్ దోషీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ  మధ్యకాలంలో ఏ సినిమా ప్రారంభోత్సవం ఇంత భారీగా జరగలేదట. అందుకే హాట్ టాపిక్ అయింది. అయితే ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకున్న వాళ్లందరూ ఇప్పుడు దాని గురించి మానేసి, ఇలియానా-చిత్రనిర్మాత గౌరంగ్ దోషీల గురించి మాట్లాడుకుంటున్నారు! ఈ సినిమా చేస్తానని తాను కమిట్ కాలేదని ఇలియానా, ఆమె మాట మారుస్తోందని గౌరంగ్ ఆరోపిస్తున్నారు. ఆ విషయంలోకి వస్తే...
 
 ‘ఆంఖే 2’కి సైన్ చేయలేదు: అమితాబ్ బచ్చన్, అర్షద్ వార్శి, అర్జున్ రామ్‌పాల్, ఇలియానా, రెజీనా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారని ప్రారంభోత్సవం నాడు దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఇలియానా మినహా మిగతావాళ్లంతా ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. దాంతో ఇలియానా తాలూకు సినిమా క్లిప్పింగ్స్ కట్ చేసి, వీడియో ప్రదర్శించారు. కట్ చేస్తే.. అసలా సినిమాలో ఇలియానా యాక్ట్ చేయడంలేదట. ‘‘ఈ సినిమా చేస్తున్నారా? అని ‘ఆంఖే 2’ గురించి అందరూ అడుగుతున్నారు.
 
  నేనీ సినిమాకి సైన్ చేయలేదు’’ అని శుక్రవారం ఇలియానా స్పష్టం చేశారు. అనుమతి లేకుండా తన పేరుని ప్రకటించడం, వీడియో క్లిప్పింగ్స్‌ని ప్రదర్శించడం ఆమెను ఆగ్రహానికి గురి చేసింది. ఈ సినిమాకి అడిగినప్పుడు ఇలియానా తిరస్కరించారని ఆమె సన్నిహితులు అంటున్నారు. రిజెక్ట్ చేసిన సినిమా తాలూకు నటీనటుల లిస్టులో తన పేరు ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసిందట. దర్శక- నిర్మాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారట.
 
 పబ్లిసిటీ కోసం ఇలియానా అవసరంలేదు ‘నేనీ సినిమా సైన్ చేయలేదు’ అని ట్విట్టర్ ద్వారా ఇలియానా పేర్కొన్న కొంత సమయానికి గౌరంగ్ స్పందించారు. ‘‘నేనూ, అనీస్ బజ్మీ ‘ఆంఖే 2’ ప్రారంభోత్సవం రెండు రోజులకు ముందు ఇలియానాను కలిశాం. సినిమా లైన్, తన పాత్ర నచ్చిందని ఆమె చెప్పింది. మరో వారంలో సైన్ చేయాల్సి ఉంది’’ అని గౌరంగ్ అన్నారు. కాగా, పబ్లిసిటీ కోసమే తన పేరుని వాడుకున్నారనీ, ఫైనాన్షియర్లను ఆకట్టుకోవడానికే ఇలా చేశారనీ ఇలియానా అన్నట్లు గౌరంగ్‌కి తెలిసిందట.
 
  ‘‘అసలు నా సినిమాకి పబ్లిసిటీయే అవసరం లేదు. ఇలియానా పేరుని వాడుకుని ఫైనాన్స్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఇలియానాను పర్సనల్‌గా కలిసినప్పుడు పారితోషికం గురించి కూడా మాట్లాడారట. ఆ విషయంలో ఓ క్లారిటీకి కూడా వచ్చామని గౌరంగ్ అంటున్నారు. ఇప్పుడేమో ఈ సినిమా చేయాలనుకోవడంలేదని ఇలియానా మాట మార్చిందని ఆరోపించారు. ఏదేమైనా.. ఈ విషయానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నాననీ, ఆరోపణలు చేయదల్చుకోలేదనీ ఆయన అన్నారు. ఇలియానా సినిమా చేయకపోయినా ఫర్వాలేదనీ, ఆమెకు ‘ఆల్ ది బెస్ట్’ అని గౌరంగ్ పేర్కొన్నారు. మరి.. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందో.. లేక మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement