breaking news
Gaurang Doshi
-
నా దవడ పగలగొట్టాడు, కొట్టి చంపాలనుకున్నాడు: నటి
బాలీవుడ్ నటి ఫ్లోరా సైని తను ఎదుర్కొన్న వేధింపులను తాజా ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్ దోషి తనను చితకబాది చంపినంత పని చేశాడని వాపోయింది. అతడిని వదిలి వెళ్లిపోతే తనను, తన తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడంటూ ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంది. మొదట్లో గౌరంగ్ ఎంతో ప్రేమగా ఉండేవాడు. కానీ తర్వాతే అసలు రంగు బయటపడింది. శ్రద్ధావాకర్ హత్యకేసులో ఏదైతే జరిగిందో నా విషయంలో కూడా అదే జరిగేదేమో! మొదట నా కుటుంబానికి దూరం చూశాడు. ఇంట్లో వాళ్లు వద్దని హెచ్చరించినా వినకుండా ఇల్లు వదిలి అతడి దగ్గరకు వెళ్లిపోయాను. కానీ అతడి ఇంటికి వెళ్లిన వారం రోజుల్లోనే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. సడన్‌గా నన్ను ఎందుకు కొడుతున్నాడో అర్థం కాలేదు, అయినా అతడు మంచివాడనే నమ్మాను. నేనే ఏదైనా పొరపాటు చేశానేమోనని మనసుకు సర్ది చెప్పుకున్నాను. కానీ తరచూ నన్ను హింసించేసరికి భరించలేకపోయాను, వదిలి వెళ్లిపోతానన్నాను. అలా చేస్తే నన్ను, నా పేరెంట్స్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఒకరోజు రాత్రి నన్ను చావబాదాడు. అతడు కొట్టే దెబ్బలకు నా దవడ పగిలింది. అతడి నాన్న ఫొటో చూపిస్తూ ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, ఈరోజు నిన్ను చంపడం ఖాయమంటూ నన్ను చితకబాదాడు. నాకు ఫొటో చూపించిన తర్వాత ఫోన్‌ను పక్కన పెట్టేందుకు కొంచెం దూరం వెళ్లగానే సడన్‌గా నా చెవిలో అమ్మ గొంతు వినిపించింది. అంతే, ఆ క్షణం నా ఒంటిమీద బట్టలున్నాయా? లేదా? డబ్బులు అవసరమా? కాదా? ఇవేవీ ఆలోచించలేదు. బతికి బట్టగడితే అంతే చాలనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను. నా ఇంటికి వచ్చేశాను. ఇంకెప్పుడూ తిరిగి అతడి దగ్గరకు వెళ్లాలనుకోలేదు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు నా మాటలు నమ్మలేదు. కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేసరికి కేసు నమోదు చేసుకున్నారు అని చెప్పుకొచ్చింది. కాగా ఫ్లోరా 2018లో మీటూ ఉద్యమం సమయంలో తొలిసారిగా తన మాజీ ప్రియుడు చేసిన అకృత్యాలను బయటపెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించింది. హిందీలో లవ్ ఇన్ నేపాల్, దబాంగ్ 2, లక్ష్మి, ధనక్ సినిమాలు చేసింది. స్త్రీ చిత్రంలో దెయ్యం పాత్రలో భయపెట్టింది. చదవండి: దే..వుడా, ఒకేరోజు 17 సినిమాలు రేవంత్ ఇక మారడా? తిండి దగ్గర కిరికిరి అవసరమా? -
ఇలియానా మాట మార్చింది: గౌరంగ్
గడచిన రెండు రోజులుగా ముంబైలో ‘ఆంఖే 2’ చిత్రం గురించే అందరి చర్చ. ‘ఆంఖే’కి సీక్వెల్‌గా అనీస్ బజ్మీ దర్శకత్వంలో గౌరంగ్ దోషీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా ప్రారంభోత్సవం ఇంత భారీగా జరగలేదట. అందుకే హాట్ టాపిక్ అయింది. అయితే ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకున్న వాళ్లందరూ ఇప్పుడు దాని గురించి మానేసి, ఇలియానా-చిత్రనిర్మాత గౌరంగ్ దోషీల గురించి మాట్లాడుకుంటున్నారు! ఈ సినిమా చేస్తానని తాను కమిట్ కాలేదని ఇలియానా, ఆమె మాట మారుస్తోందని గౌరంగ్ ఆరోపిస్తున్నారు. ఆ విషయంలోకి వస్తే... ‘ఆంఖే 2’కి సైన్ చేయలేదు: అమితాబ్ బచ్చన్, అర్షద్ వార్శి, అర్జున్ రామ్‌పాల్, ఇలియానా, రెజీనా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారని ప్రారంభోత్సవం నాడు దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఇలియానా మినహా మిగతావాళ్లంతా ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. దాంతో ఇలియానా తాలూకు సినిమా క్లిప్పింగ్స్ కట్ చేసి, వీడియో ప్రదర్శించారు. కట్ చేస్తే.. అసలా సినిమాలో ఇలియానా యాక్ట్ చేయడంలేదట. ‘‘ఈ సినిమా చేస్తున్నారా? అని ‘ఆంఖే 2’ గురించి అందరూ అడుగుతున్నారు. నేనీ సినిమాకి సైన్ చేయలేదు’’ అని శుక్రవారం ఇలియానా స్పష్టం చేశారు. అనుమతి లేకుండా తన పేరుని ప్రకటించడం, వీడియో క్లిప్పింగ్స్‌ని ప్రదర్శించడం ఆమెను ఆగ్రహానికి గురి చేసింది. ఈ సినిమాకి అడిగినప్పుడు ఇలియానా తిరస్కరించారని ఆమె సన్నిహితులు అంటున్నారు. రిజెక్ట్ చేసిన సినిమా తాలూకు నటీనటుల లిస్టులో తన పేరు ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసిందట. దర్శక- నిర్మాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారట. పబ్లిసిటీ కోసం ఇలియానా అవసరంలేదు ‘నేనీ సినిమా సైన్ చేయలేదు’ అని ట్విట్టర్ ద్వారా ఇలియానా పేర్కొన్న కొంత సమయానికి గౌరంగ్ స్పందించారు. ‘‘నేనూ, అనీస్ బజ్మీ ‘ఆంఖే 2’ ప్రారంభోత్సవం రెండు రోజులకు ముందు ఇలియానాను కలిశాం. సినిమా లైన్, తన పాత్ర నచ్చిందని ఆమె చెప్పింది. మరో వారంలో సైన్ చేయాల్సి ఉంది’’ అని గౌరంగ్ అన్నారు. కాగా, పబ్లిసిటీ కోసమే తన పేరుని వాడుకున్నారనీ, ఫైనాన్షియర్లను ఆకట్టుకోవడానికే ఇలా చేశారనీ ఇలియానా అన్నట్లు గౌరంగ్కి తెలిసిందట. ‘‘అసలు నా సినిమాకి పబ్లిసిటీయే అవసరం లేదు. ఇలియానా పేరుని వాడుకుని ఫైనాన్స్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఓ ఐదు నక్షత్రాల హోటల్లో ఇలియానాను పర్సనల్‌గా కలిసినప్పుడు పారితోషికం గురించి కూడా మాట్లాడారట. ఆ విషయంలో ఓ క్లారిటీకి కూడా వచ్చామని గౌరంగ్ అంటున్నారు. ఇప్పుడేమో ఈ సినిమా చేయాలనుకోవడంలేదని ఇలియానా మాట మార్చిందని ఆరోపించారు. ఏదేమైనా.. ఈ విషయానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నాననీ, ఆరోపణలు చేయదల్చుకోలేదనీ ఆయన అన్నారు. ఇలియానా సినిమా చేయకపోయినా ఫర్వాలేదనీ, ఆమెకు ‘ఆల్ ది బెస్ట్’ అని గౌరంగ్ పేర్కొన్నారు. మరి.. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్స్టాప్ పడుతుందో.. లేక మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.