ఇలియానాకు రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్! | Ileana DCruz Shares pregnancy as she flaunts baby bump Pics In Social Media | Sakshi
Sakshi News home page

Ileana DCruz: ఇలియానాకు రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్!

May 29 2025 7:29 PM | Updated on May 29 2025 7:44 PM

Ileana DCruz Shares pregnancy as she flaunts baby bump Pics In Social Media

హీరోయిన్ ఇలియానా గతేడాది అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  సెప్టెంబర్‌ 2024లో తాను రెండోసారి గర్భం ధరించినట్లు  తెలిపింది.  2023లో  మైఖేల్ డోలన్‌ను పెళ్లాడింది. అయితే కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ముద్దుగుమ్మ.. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్‌ పూర్తి ఫొటోను షేర్‌ చేసింది. తాజాగా తన బేబీబంప్‌నకు సంబంధించిన ఫోటోలను ఇలియానా మరోసారి సోషల్ మీడియాలో పంచుకుంది. 'బంప్ బడ్డీస్' అంటూ తన స్నేహితురాలితో ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.

కాగా.. ఇలియానా తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తన తొలి చిత్రం దేవదాసుతో అందరికీ తెగ నచ్చేసింది. పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్‌.. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటించింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్‌లో బర్ఫీ మూవీ ఛాన్స్‌ వచ్చింది. అది మంచి కథ కావడంతో అందులో నటించింది. ఆ వెంటనే హిందీలోనే వరుస చిత్రాలు చేసింది.  ఇలియానా చివరిసారిగా రొమాంటిక్ కామెడీ చిత్రం 'దో ఔర్ దో ప్యార్'లో నటించింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి కీలక పాత్రల్లో నటించారు.

i
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement