ఐస్‌క్రీమ్ ప్రేరణతో... | Ice cream was inspired ... | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్ ప్రేరణతో...

Nov 22 2014 1:05 AM | Updated on Aug 11 2018 8:45 PM

ఐస్‌క్రీమ్ ప్రేరణతో... - Sakshi

ఐస్‌క్రీమ్ ప్రేరణతో...

జై ఆకాశ్, అర్చన, కోమల్ శర్మ, సోనాల్ ఝాన్సీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్ హారర్ థ్రిల్లర్ ‘చాక్లెట్’.

జై ఆకాశ్, అర్చన, కోమల్ శర్మ, సోనాల్ ఝాన్సీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్ హారర్ థ్రిల్లర్ ‘చాక్లెట్’. రామకృష్ణ వీర్నల దర్శకుడు. రావుట్ల లింగం నిర్మాత. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలు తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని జై ఆకాశ్ చెప్పారు.

చాక్లెట్‌ని అందరూ ఎలా ఇష్టపడతారో... ఈ సినిమాను కూడా అలాగే అందరూ ఇష్టపడతారని అర్చన అన్నారు. వచ్చేనెలలో రెండో షెడ్యూల్ మొదలుపెడతామనీ, రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ టైటిలే తమ ‘చాక్లెట్’ టైటిల్‌కి ప్రేరణ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రామరాజు, సంగీతం: ప్రేమ్.

Advertisement
 
Advertisement
Advertisement