భూగ్రహం నుంచి తప్పించుకోవాలని ఉంది: ఇబ్రహిం

Ibrahim Ali Khan Shares Funny Photo  From Quarantine On His Instagram - Sakshi

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా మంది సినీ ప్రముఖులు స్వీయ నియంత్రణలో భాగంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. అలా హోం క్వారంటైన్‌లో ఉన్న సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహిం అలీఖాన్‌ తాజాగా ఓ ఫన్నీగా ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో ఇబ్రహిం.. బూడిద రంగు పైజామాపై గంజి టీ షర్ట్ ధరించి, భూగ్రహం ముందు నిల్చున్నట్టు ఉన్నారు. అదేవిధంగా ‘క్వారంటైన్‌లో ఉండటం చాలా విసుగుగా ఉంది. ఈ భూగ్రహం నుంచి తప్పించుకోవాలని ఉంది’ అంటూ ఇబ్రహిం ఈ ఫోటోకు కాప్షన్‌ కూడా  పెట్టారు.

Quarantine was so boring had to escape 🌎

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

దీంతో  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇబ్రహిం అలీఖాన్‌ సినీరంగ ప్రవేశం గురించి అతని తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతనివ్వని విషయం తెలిసిందే. ఇక స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సైఫ్‌ కూతురు సారా అలీఖాన్‌ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక గురువారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా 649 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 13కి చేరింది. (నీకు క‌రోనా సోకింది.. యువతికి వేధింపులు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top