బాహుబలి 3లో నటిస్తా : హాలీవుడ్ స్టార్‌ | Sakshi
Sakshi News home page

బాహుబలి 3లో నటిస్తా : హాలీవుడ్ స్టార్‌

Published Sat, Mar 9 2019 2:59 PM

I Want to be in Baahubali 3 Says Samuel L Jackson - Sakshi

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకువచ్చిన విజువల్‌ వండర్‌ బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించింది. పలు హాలీవుడ్ చిత్రాల కన్నా ఎక్కువ కలెక్షన్లు సాదించిన బాహుబలి హాలీవుడ్ స్టార్లను సైతం ఆకట్టుకుంది.

తాజాగా హాలీవుడ్ యాక్టర్‌ సామ్యూల్‌ ఎల్‌ జాక్సన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ అవకాశం ఇస్తే బాహుబలి 3లో నటిస్తానన్నారు. ఎవెంజర్స్ సీరిస్‌లోని నిక్‌ ఫ్యూరీ పాత్రలో ఫేమస్‌ అయిన సామ్యూల్‌ ఇండియన్‌ సినిమాలో నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా బాహుబలి సీరిస్‌లో నటించాలనుందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. మరి ఈ హాలీవుడ్ స్టార్‌ కోరికను రాజమౌళి తీరుస్తాడో లేదో చూడాలి.

Advertisement
Advertisement