నేను చిన్నప్పుడే ప్రేమలో పడ్డా! | I fell in love with my childhood | Sakshi
Sakshi News home page

నేను చిన్నప్పుడే ప్రేమలో పడ్డా!

May 7 2017 10:38 AM | Updated on Aug 9 2018 7:28 PM

నేను చిన్నప్పుడే ప్రేమలో పడ్డా! - Sakshi

నేను చిన్నప్పుడే ప్రేమలో పడ్డా!

నేనెప్పుడో అంటే ఎనిమిదేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానంటోంది నటి తాప్సీ.

నేనెప్పుడో అంటే ఎనిమిదేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానంటోంది నటి తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ మోడలింగ్‌ రంగం నుంచి వెండి తెరకు దిగుమతి అయిన నటి అన్నది గమనార్హం. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైందీ ఈ భామ. ఆ తరువాత ఆరంభం, కాంచన 2, వైరాజావై వంటి చాలా తక్కువ చిత్రాల్లోనే నటించిన తాప్సీని బాలీవుడ్‌ చేయి అందించింది. హిందీలో బేబీ, పింక్, రన్నింగ్‌ షాది, ది ఘాజీ ఎటాక్‌ (త్రిభాషా చిత్రం) చిత్రాలు మంచి పేరే తెచ్చి పెట్టాయి.

ఇటీవల తెరపైకి వచ్చిన నామ్‌ షబానా చిత్రం నటిగా తాప్సీ స్థాయిని మరింత పెంచిందనే చెప్పాలి. ప్రస్తుతం తడ్కా, జుడ్వా 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే కోలీవుడ్‌లో అవకాశాలను ఆశిస్తున్నానంటున్న ఈ బ్యూటీని ఇక్కడ గ్లామరస్‌ పాత్రలకే వాడుకునే ప్రయత్నం చేశారు. బాలీవుడ్‌లో తనలోని నటనను వెలికి తీసే పాత్రల్లో నటించే అవకాశాలు రావడం గమనార్హం.

కాగా ప్రేమ గురించి ఈ జాణను అడగ్గా తాను ఎనిమిదేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. అయితే అది మీరనుకునే ప్రేమ కాదని, తనకు నాట్యం అంటే వల్లమాలిన ప్రేమ అని, నాట్యాన్ని ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రేమిస్తున్నానని వివరించింది. నాట్యమే తాను, తానే నాట్యం అని, నాట్యం లేకుండా తాప్సీ లేదని పేర్కొంది. అంతే కానీ, తాను ఇప్పటి వరకూ మనుషులనెవరని ప్రేమించలేదని చెప్పింది.

చిత్ర పరిశ్రమలో హీరోలు, ఇతర సహనటీనటులతో ప్రేమగా ఉంటానని, అయితే అది వృత్తిపరమైన ప్రేమేనని చెప్పుకొచ్చింది. ఇక జీవితంలో తాను ప్రేమించింది ఒకే ఒకరినని అంది. అదీ తానేనని చెప్పింది. ఎస్‌ తానంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. ఇక నటిగా మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానని తాప్సీ చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement