ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ గాడ్‌ గిఫ్ట్‌ | I feel prabhas is God's gift to uppalapati family, says krishnamraju wife syamala | Sakshi
Sakshi News home page

మా వంశానికి ప్రభాస్‌ గాడ్‌ గిఫ్ట్‌: శ్యామల

Apr 28 2017 3:27 PM | Updated on Jul 14 2019 4:05 PM

ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ గాడ్‌ గిఫ్ట్‌ - Sakshi

ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ గాడ్‌ గిఫ్ట్‌

ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ దేవుడిచ్చిన వరమని ప్రముఖ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల అన్నారు.

ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ దేవుడిచ్చిన వరమని ప్రముఖ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల అన్నారు. బాహుబలి-2 సినిమా వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... 'ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది నా మాట కాదు. ప్రపంచం అంతా ఒకటే మాట. అదే బాహుబలి. దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమిమీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం బాహుబలి సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే రాజమౌళి, ప్రభాస్‌ ఫ్యామీలి కూడా. ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ గాడ్‌ గిఫ్ట్. వెరీ ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను' అని అన్నారు.

మరోవైపు బాహుబలి-2 చిత్రంపై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమాలో ప్రభాస్‌-అనుష్క జంట చాలా బాగుందని, అలాగే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా అదిరిపోయాయని తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు మిగిలిన దిక్షిణాది రాష్ట్రాల్లోనూ బాహుబలి దుమ్మురేపుతున్నాడు. త్రివేండ్రం, చెన్నైల్లో సినీ ప్రేమికులు బాహుబలికి సాహో అంటున్నారు. ఇక బాహుబలి ఫీవర్‌తో ఉత్తరాది ఊగిపోతోంది. ఖాన్‌ త్రయం సినిమాలకు మించిన క్రేజ్‌తో నార్త్‌లోనూ దుమ్మురేపుతోంది. మల్టీఫ్లెక్స్‌ల నుంచి మామూలు థియోటర్ల వరకూ ఎక్కడ చూసినా  బాహుబలి సందడే కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement