నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది! | I desire to be a mother : Kathrina Khaif | Sakshi
Sakshi News home page

నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది!

Feb 15 2014 12:10 AM | Updated on Sep 2 2017 3:42 AM

నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది!

నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది!

‘‘ఏ మనిషికైనా జీవిత భాగస్వామి అవసరం. అప్పుడే జీవితానికి ఓ పరిపూర్ణత లభిస్తుంది’’ అంటున్నారు కత్రినా కైఫ్.

‘‘ఏ మనిషికైనా జీవిత భాగస్వామి అవసరం. అప్పుడే జీవితానికి ఓ పరిపూర్ణత లభిస్తుంది’’ అంటున్నారు కత్రినా కైఫ్. మరి... మీ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న కత్రినా ముందుంచితే -‘‘ఇప్పుడు మాత్రం కాదు. పదేళ్ల లోపు పెళ్లి చేసుకుంటా’’ అన్నారు. రణబీర్‌కపూర్‌తో మీ పెళ్లి ఫిక్స్ అయ్యిందటగా? అనడిగితే -‘‘ఎవరన్నారు? రణబీర్ చెప్పాడా? నేను చెప్పానా? మీ అంతట మీరే ఊహించేసుకుంటే ఎలా? అసలిప్పటి వరకూ ‘నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని ఎవరూ నాతో అనలేదు.
 
 కానీ, బాగా ఖాళీగా ఉన్నవాళ్లు మాత్రం నన్నెవరో ఒకరితో ముడి పెట్టేస్తున్నారు. ఒకవేళ నాకు కనుక పెళ్లి ఫిక్స్ అయితే, అందరికీ చెప్పే చేసుకుంటా. ఇలా నిశ్చితార్థం అవ్వగానే అలా చెప్పేస్తా. ఎందుకంటే, పెళ్లనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు కదా.. దాయడానికి. వాస్తవానికి నాకు వివాహ బంధం అంటే చాలా గౌరవం. నా సిస్టర్‌కి పెళ్లయ్యింది. అప్పుడు నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ తర్వాత తనకు పిల్లలు పెట్టారు. అప్పుడు నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది. అందుకని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అమ్మ అవుతా. అయితే ఇప్పుడు కాదు’’ అని స్పష్టం చేశారు కత్రినా కైఫ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement