breaking news
Marriage relation
-
మహిళా రైతులతో సోనియా ముచ్చట్లు: మీరే పిల్లను చూడండి..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి నవ్వులు పూయించింది. హరియాణాకు చెందిన కొందరు మహిళలు ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌కు వచ్చి సోనియాగాంధీ కుటుంబంతో కాసేపు గడిపారు. వారిని సాదరంగా ఆహ్వానించిన గాంధీ కుటుంబం ఆతిథ్యమిచ్చింది. ఆ మహిళలతో కలిసి సోనియా, ప్రియాంక, రాహుల్ భోజనాలు చేశారు. ఆ తర్వాత కాసేపు వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ సోనియాతో ‘‘రాహుల్‌కి పెళ్లి చేద్దామా’’ అని అడిగారు. దానికి సోనియా నవ్వుతూ ‘‘మీరే పిల్లని చూడండి’’ అని వాళ్లతో చెప్పారు. పక్కనే ఉండి ఇదంతా వింటున్న రాహుల్ ‘‘అవుతుంది. అవుతుంది’’ అని అన్నారు. దీంతో ప్రియాంక రాహుల్ స్వీట్‌గా కనిపిస్తున్నా చాలా కొంటెవాడని చెప్పారు. వారి సమావేశం అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు హరియాణా సోనిపట్ జిల్లాకు చెందిన మహిళలతో ముచ్చటించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మహిళా కార్మికులతో కలిసి నాట్లు వేశారు. తాము ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీని చూడలేదని వారు చెబితే అప్పట్లోనే రాహుల్ వారికి ఢిల్లీకి పిలుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి ఢిల్లీ చూపించాక తమ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. కొందరు మహిళలు రాహుల్‌కు ప్రేమగా తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోని రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మా ఇంటికి ప్రత్యేక అతిథులు వచ్చారు. ఈ రోజు మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. వారితో కలిసి భోజనం చేశాం. ముచ్చట్లు చెప్పుకున్నాం. వారంతా మాకు ఎంతో అమూ ల్యమైన కానుకలు ఇచ్చారు. దేశీ నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో చేసిన ఊరగాయలు ఎంతో ప్రేమతో ఇచ్చారు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఆ మహిళ లతో కలిసి సోనియా, ప్రియాంక స్టెప్పులు వేశారు. ఇదీ నేపథ్యం... నా ఇంటిని ప్రభుత్వం లాగేసుకుంది జూలై 8న భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హరియాణాలోని సోనిపట్ జిల్లా మదినా గ్రామానికి వెళ్లారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు, రైతు కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఢిల్లీలోని రాహుల్ సొంతింటిని గురించి అడిగారు. అందుకు రాహుల్..తనకు సొంతిల్లు లేదని, దానిని ప్రభుత్వం తీసేసుకుందని బదులిచ్చారు. ఢిల్లీలోని తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఫోన్ చేశారు. రైతు మహిళలు భోజనానికి రావాలనుకుంటున్నారని చెప్పారు...ఇదంతా 12 నిమిషాల నిడివున్న వీడియోలో ఉంది. -
నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది!
‘‘ఏ మనిషికైనా జీవిత భాగస్వామి అవసరం. అప్పుడే జీవితానికి ఓ పరిపూర్ణత లభిస్తుంది’’ అంటున్నారు కత్రినా కైఫ్. మరి... మీ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న కత్రినా ముందుంచితే -‘‘ఇప్పుడు మాత్రం కాదు. పదేళ్ల లోపు పెళ్లి చేసుకుంటా’’ అన్నారు. రణబీర్‌కపూర్‌తో మీ పెళ్లి ఫిక్స్ అయ్యిందటగా? అనడిగితే -‘‘ఎవరన్నారు? రణబీర్ చెప్పాడా? నేను చెప్పానా? మీ అంతట మీరే ఊహించేసుకుంటే ఎలా? అసలిప్పటి వరకూ ‘నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని ఎవరూ నాతో అనలేదు. కానీ, బాగా ఖాళీగా ఉన్నవాళ్లు మాత్రం నన్నెవరో ఒకరితో ముడి పెట్టేస్తున్నారు. ఒకవేళ నాకు కనుక పెళ్లి ఫిక్స్ అయితే, అందరికీ చెప్పే చేసుకుంటా. ఇలా నిశ్చితార్థం అవ్వగానే అలా చెప్పేస్తా. ఎందుకంటే, పెళ్లనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు కదా.. దాయడానికి. వాస్తవానికి నాకు వివాహ బంధం అంటే చాలా గౌరవం. నా సిస్టర్‌కి పెళ్లయ్యింది. అప్పుడు నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ తర్వాత తనకు పిల్లలు పెట్టారు. అప్పుడు నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది. అందుకని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అమ్మ అవుతా. అయితే ఇప్పుడు కాదు’’ అని స్పష్టం చేశారు కత్రినా కైఫ్.