నేను పెళ్లికి రెడీ ! | I am ready for marriage says tabu | Sakshi
Sakshi News home page

నేను పెళ్లికి రెడీ !

Jul 28 2015 10:49 PM | Updated on Sep 3 2017 6:20 AM

నేను పెళ్లికి రెడీ !

నేను పెళ్లికి రెడీ !

పెళ్లి కానివాళ్లు తరచుగా ఎదుర్కొనే ప్రశ్నే ఇది. ఇక.. పెళ్లి కాని సినిమా తారలనైతే ప్రతి ఇంటర్వ్యూలోనూ ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడగడం సహజం.

 మీ పెళ్లెప్పుడు...?
 పెళ్లి కానివాళ్లు తరచుగా ఎదుర్కొనే ప్రశ్నే ఇది. ఇక.. పెళ్లి కాని సినిమా తారలనైతే ప్రతి ఇంటర్వ్యూలోనూ ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడగడం సహజం. ఈ ప్రశ్న ఎదుర్కొంటున్న తారల్లో టబు కూడా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ‘దృశ్యం’ హిందీ చిత్రం ప్రచార కార్యక్రమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో టబు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎప్పటిలానే ఇప్పుడు కాదనో, నో కామెంట్ అనో అనలేదామె. ‘‘నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది. పిల్లలు కూడా కావాలనుకుంటున్నా. నాకంటూ ఓ కుటుంబం కావాలి’’ అని పేర్కొన్నారు టబు. కొంతమంది కథానాయికలు విదేశాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. మీకలాంటి ఆలోచన ఉందా? అంటే -‘‘లేదు. ఏదో పని ఉంటే వెళ్లమంటే వెళతాను కానీ, మనకంటూ ఎవరూ లేని దేశంలో నేనెందుకు ఉంటా? పైగా ముంబైకి అలవాటు పడిన వాళ్లు ఇంకెక్కడా ఉండలేరు’’అని చెప్పుకొచ్చారామె.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement