పాల్‌పై డాక్యుమెంటరీ | I Am Paul Walker Documentary to Air on Paramount Network | Sakshi
Sakshi News home page

పాల్‌పై డాక్యుమెంటరీ

Jul 29 2018 2:56 AM | Updated on Jul 29 2018 2:56 AM

I Am Paul Walker Documentary to Air on Paramount Network - Sakshi

పాల్‌ వాకర్‌

‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ హాలీవుడ్‌ మూవీ సిరీస్‌ ద్వారా అందులో ఒక హీరో పాల్‌ వాకర్‌ సుపరిచితుడే. 2013లో జరిగిన కార్‌ యాక్సిడెంట్‌లో పాల్‌ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించింది హాలీవుడ్‌ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌.  ‘ఐ యామ్‌’ పేరుతో  డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందిస్తుంటుంది పారామౌంట్‌ సంస్థ. ఈ సిరీస్‌లో భాగంగానే పాల్‌ వాకర్‌పై కూడా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో పాల్‌ బాల్యంలోని కొన్ని వీడియోలను చూపించనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌లో పాల్‌తో పాటు యాక్ట్‌ చేసిన యాక్టర్స్, డైరెక్టర్స్‌తో ఇంటర్వ్యూలను కూడా  పొందుపరిచారట. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే రిలీజ్‌ చేసింది పారామౌంట్‌. ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్‌ 11న ప్రసారం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement