వేటకు రెడీ అయిన శ్రీకాంత్, తరుణ్ | Hunting   Who will   Srikanth, Tarun | Sakshi
Sakshi News home page

వేటకు రెడీ అయిన శ్రీకాంత్, తరుణ్

Mar 14 2014 11:42 PM | Updated on Sep 2 2017 4:42 AM

వేటకు  రెడీ అయిన  శ్రీకాంత్, తరుణ్

వేటకు రెడీ అయిన శ్రీకాంత్, తరుణ్

శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వేట’.

 శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వేట’. అశోక్ పల్లె దర్శకుడు. పి.శ్వేతాలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.

ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ‘‘ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్‌లో వచ్చే మాస్ సన్నివేశాలు అలరిస్తాయి. చక్రి సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అని సమర్పకుడు సి.కల్యాణ్ చెప్పారు.

నిజజీవితంలో స్నేహానికి విలువిచ్చే తాను ఇప్పటివరకూ స్నేహంపై ఒక్క పాటను కూడా స్వరపరచలేదని, ఆ అవకాశం ఈ సినిమా ద్వారా లభించిందని చక్రి ఆనందం వెలిబుచ్చారు. వాణిజ్యవిలువల సమ్మిళితం ఈ సినిమా అని, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందని తరుణ్ చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement