చలో లాస్‌ ఏంజిల్స్‌

Huma Qureshi starts working on Netflix original film Army Of The Dead - Sakshi

పాస్‌పోర్ట్, నిత్యం అవసరమయే వస్తువులను జాగ్రత్తగా సూట్‌కేస్‌లో ప్యాక్‌ చేసుకుంటున్నారు హీరోయిన్‌ హ్యూమా ఖురేషి. త్వరలో ఆమె లాస్‌ ఏంజిల్స్‌కు పయనం కానున్నారు. దాదాపు రెండు నెలలు అక్కడే ఉంటారట.. ‘డ్వాన్‌ ఆఫ్‌ ది డెడ్, 300, జస్టిస్‌ లీగ్‌’ వంటి ఇంగ్లీష్‌ చిత్రాలను తెరకెక్కించిన జాక్‌ స్నైడర్‌ దర్శకత్వంలో ‘ఆర్మీ ఆఫ్‌ ది డెడ్‌’ అనే హాలీవుడ్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డావే బౌటిస్టా, థియో రోసి, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు చేయనున్నారు. కిరాయి సైనికుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో లాస్‌ ఏంజిల్స్‌ను ప్రారంభం కానుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లనున్నారు హ్యూమా. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top