కీరవాణిగారు గుర్తుకొస్తారు! | Hulchul Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

కీరవాణిగారు గుర్తుకొస్తారు!

Aug 18 2018 12:26 AM | Updated on Aug 18 2018 12:26 AM

Hulchul Movie Teaser Launch - Sakshi

ధన్య, రుద్రా„Š

రుద్రా„Š, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘హల్‌చల్‌’. శ్రీపతి కర్రి దర్శకత్వంలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై గణేష్‌ కొల్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు రాజ్‌ కందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకుడు రఘు కుంచె, డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ విడుదల చేశారు. శ్రీపతి కర్రి మాట్లాడుతూ– ‘‘హల్‌చల్‌ అనే డ్రగ్‌ బ్లెండర్‌ స్టోరీ. కేవలం డ్రగ్స్‌ అంశాలే ఉండవు. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, లవ్‌.. అన్నీ ఉంటాయి.

గణేష్‌ కొత్త నిర్మాతైనా రాజీ పడకుండా సపోర్ట్‌ చేశారు’’ అన్నారు. ‘‘నా నమ్మకాన్ని శ్రీపతి వమ్ము చేయలేదు. హనుమాన్‌ మంచి సంగీతం ఇచ్చారు. పాటలు వింటుంటే కీరవాణిగారు గుర్తుకొస్తారు. త్వరలో సినిమా రిలీజ్‌  చేయనున్నాం’’ అన్నారు గణేష్‌ కొల్లూరి. ‘‘క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న నాకు హీరోయిన్‌గా అవకాశమిచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు ధన్య. ‘‘16 ఏళ్ల కష్టం తర్వాత హీరో అవ్వాలనే నా కోరిక ‘హల్‌చల్‌’తో నెరవేరింది’’ అన్నారు రుద్రా„Š .

Advertisement
 
Advertisement
Advertisement