‘సాక్ష్యం’ శాటిలైట్‌ రైట్స్‌కు రికార్డ్‌ ప్రైజ్‌ | Huge Offer for Saakshyam Satellite Rights | Sakshi
Sakshi News home page

Mar 1 2018 10:51 AM | Updated on Aug 3 2019 12:45 PM

Huge Offer for Saakshyam Satellite Rights  - Sakshi

జయ జానకి నాయక సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్‌ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న  తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అంతేకాదు బిజినెస్‌ పరంగానూ సాక్ష్యం సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న సాక్ష్యం సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్‌ సృష్టించింది. దీంతో థియేటర్ హక్కలు కాకుండానే 13కోట్లకు పైగా బిజినెస్‌ సాధించింది సాక్ష్యం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ లు కనువిందు చేయనున్నాయి. 

ఈ సీన్స్‌కు సంబంధించిన ఫుటేజ్‌ చూసిన జీ న్యూస్‌ సంస్థ ఇంత భారీ మొత్తం వెచ్చించినట్టుగా తెలుస్తోంది. సాయి శ్రీనివాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement