రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

Hrithiks Film Crosses Rs Hundred Cr Mark At Boxoffice - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించిన సూపర్‌ 30 బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా దూసుకుపోతోంది. పదిరోజుల్లో ఈ మూవీ రూ 100 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. పలు స్ధానిక, హాలీవుడ్‌ చిత్రాల నుంచి పోటీ ఎదురైనా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ 30 దూకుడుకు బ్రేక్‌ పడలేదని రెండో వారాంతంలోనూ మూవీ మెరుగైన వసూళ్లు రాబట్టి రూ 100 కోట్ల మార్క్‌ను దాటిందని ప్రముఖ సినీ క్రిటిక్‌, ట్రేడ్‌ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

సూపర్‌ 30 రెండవ వారాంతంలో శనివారం రూ 8.53 కోట్లు, ఆదివారం రూ 11.68 కోట్లు రాబట్టి మొత్తం ఇండియాలో రూ 100.58 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. సూపర్‌ 30లో హృతిక్‌తో పాటు నందిష్‌ సంధూ, ఆదిత్య శ్రీవాస్తవ, వీరేంద్ర సక్సేనా, పంకజ్‌ త్రిపాఠి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top