
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా హిమజ ఎంట్రీ ఇచ్చారు. అందం, అభినయం ఉన్న హిమజ పలు సీరయల్స్‌లో నటిస్తూ.. సినిమాల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. శివం, నేను శైలజ, ధృవ, శతమానం భవతి, స్పైడర్, మహానుభావుడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో నటించి మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచకున్నారు.
సీరియల్స్, సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్‌బాస్ షోతోనూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. బిగ్‌బాస్‌లో గెలిచేందుకు ఇప్పటికే తన తరుపున సోషల్ మీడియాలో ఓ టీమ్ కూడా నిరంతరం శ్రమిస్తుండగా.. హౌస్‌లో తన ప్రవర్తనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని, ఇతర కంటెస్టెంట్లకు పోటీ ఇస్తారో లేదో చూడాలి.