మ్యూజికల్‌ హారర్‌ | heza movie press meet | Sakshi
Sakshi News home page

మ్యూజికల్‌ హారర్‌

Aug 16 2019 12:09 AM | Updated on Aug 16 2019 12:09 AM

heza movie press meet - Sakshi

మున్నా కాశీ

‘‘మిస్టర్‌ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన మున్నా కాశీ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’ (ఎ మ్యూజికల్‌ హారర్‌). ముమైత్‌ ఖాన్, నూతన నాయుడు (బిగ్‌ బాస్‌ ఫేమ్‌), లక్ష్మణ్‌ (ఆర్‌ఎక్స్‌ 100ఫేమ్‌), లిజి గోపాల్, ప్రీతం  నిగమ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎస్‌ఎన్‌ మూర్తి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

మున్నా కాశీ  మాట్లాడుతూ– ‘‘ఒక మ్యూజికల్‌ హారర్‌గా మంచి కథతో తెరెకెక్కించాం. టీజర్‌కి, పాటలకి మంచి స్పందన వస్తోంది. సినిమా బాగా రావడానికి కారణమైన కేవీఎస్‌ఎన్‌ మూర్తి, సహ నిర్మాత వి.యన్‌జ వోలెటిగార్లకు కృతజ్ఞతలు. విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్‌ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు కెవీఎస్‌ఎన్‌ మూర్తి.

Advertisement
 
Advertisement
Advertisement