అమ్మో రేప్ సీనా! నిత్యామీనన్
బలాత్కార సన్నివేశంలో నటించడానికి సంకోచించానని నటి నిత్యామీనన్ పేర్కొంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో పునర్ నిర్మాణమతోంది.
బలాత్కార సన్నివేశంలో నటించడానికి సంకోచించానని నటి నిత్యామీనన్ పేర్కొంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో పునర్ నిర్మాణమతోంది. సీనియర్ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో ‘22 మాలిని పాళయం కోట్టై’ పేరుతో రూపొందుతోంది. ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తోంది. ఆమె మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించమని శ్రీప్రియ అడిగినప్పుడు సంశయించానంది.
అయితే మహిళా దర్శకురాలి దర్శకత్వంలో నటించడం వలన తన సంకోచం పోయిందని చెప్పింది. మహిళలపై బలాత్కారానికి పాల్పడేవారు ఈ చిత్రం చూస్తే అలాంటి చర్యలకు పాల్పడరని అంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత మానవ మృగాల్లో తప్పకుండా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రం కోసం బలాత్కార సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ముంబయిలో మహిళ ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం జరగడం దిగ్భ్రాంతిని కలిగించిందని నిత్యామీనన్ పేర్కొంది.