హీరోయిన్ల ముద్దుల పోటీ | Heroines lip lock kiss Latest etraksan | Sakshi
Sakshi News home page

హీరోయిన్ల ముద్దుల పోటీ

Sep 15 2014 11:54 PM | Updated on Aug 28 2018 4:30 PM

హీరోయిన్ల ముద్దుల పోటీ - Sakshi

హీరోయిన్ల ముద్దుల పోటీ

అందాలను ఆరబోయడానికి ఒకప్పటి కథా నాయికలు సంకోచించే వారు. అలాంటిది ఇప్పటి హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలు దాటి లిప్‌లాక్ కిస్‌ల వరకు వచ్చేశారు. అంతేకాదు ఇప్పుడు

 అందాలను ఆరబోయడానికి ఒకప్పటి కథా నాయికలు సంకోచించే వారు. అలాంటిది ఇప్పటి హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలు దాటి లిప్‌లాక్ కిస్‌ల వరకు వచ్చేశారు. అంతేకాదు ఇప్పుడు హీరోకు ఎవరెక్కువ పెదవిపై ముద్దులు పెడతారన్న విషయంలో పోటీ నెలకొనడం విశేషం. గ్లామరస్ అనేది పాత దయిపోయింది. లిప్‌లాక్ కిస్‌లు లేటెస్ట్ ఎట్రాక్షన్‌గా మారింది. తమిళంలో ఇంతకు ముందు అళగియ అసురా, కేడీ బిల్లా కిల్లాడి రంగా చిత్రాల్లో నటించిన రెజీనా అప్పట్లో అరకొర దుస్తులు ధరించేది లేదంటూ షరతులు పెట్టింది.
 
 దీంతో లాభం లేదనుకుందో ఏమో తాను అందాలారబోతకు రెడీ అంటూ గ్లామరస్ గోదాలోకి దిగింది. మరో నటి రకుల్ ప్రీతి అయితే ఆరంభంలోనే పొదుపు దుస్తులతో నటించడానికి సిద్ధం అయిపోయింది. తడయర తాక్క, ఎన్నమో ఏదో చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి, రెజినాకు మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరూ అవకాశాలను రాబట్టుకోవడానికి లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి రెడీ అంటూ బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. దీంతో ఈ భామలకు అవకాశాలు క్యూకడుతున్నాయి.
 
 తమిళంతోపాటు తెలుగులోనూ రకుల్‌ప్రీతి, రెజీనాలు బిజీ హీరోయిన్లుగా మారిపోయారు. వీళ్ల తెగింపు నటి ప్రణీతకు ముప్పుగా మారిందట. తమిళంలో శకుని చిత్రంలో కార్తీకి జంటగా నటించిన ప్రణీత ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో అమ్మడు టాలీవుడ్‌పై దృష్టిసారించింది. అక్కడ అత్తారింటికి దారేది లాంటి ఒకటి రెండు చిత్రాలు విజయం సాధించడంతో మంచి పేరు వచ్చింది. అయితే కాస్త సంసారపక్షంగా నటిస్తున్న ప్రణీతకు రకుల్‌ప్రీతి, రెజీనాల ఎక్స్‌పోజింగ్ నటన భయం పుట్టిస్తుందట. ఇక ప్రణీత కూడా మనసు మార్చుకోక తప్పదేమో అంటున్నాయి సినీ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement