ఆ బ్యూటీ సినీ కెరీర్, జీవితం.. రెండూ సంచలనమే.. | Heroine Nayanatara Marriage will In November? | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో పెళ్లిపీటలపైకి..

Mar 31 2018 3:57 AM | Updated on Mar 31 2018 4:07 AM

Heroine Nayanatara Marriage will In November? - Sakshi

నటి నయనతార

సాక్షి, చెన్నై: అగ్రనటి నయనతారపై రోజుకో సంచలన వార్త ప్రచారమవుతూ ఆమె అభిమానుల్ని టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ బ్యూటీ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం రెండూ సంచలనంగానే సాగుతున్నాయి. నటిగా వద్దంటే అవకాశాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక వ్యక్తిగతంగా చూస్తే ప్రేమ, జాలీ అంటూ యమజోరుగా సాగిపోతోంది. దర్శకుడు విఘ్నేశ్‌శివతో పరిచయం నయనతార దిశను మార్చేసిందనే చెప్పాలి. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన నానూమ్‌ రౌడీదాన్‌ చిత్రం హిట్‌. ఆ చిత్రంతో పరిచయం అయిన ఈ జంట బంధం బలపడింది. 

నయనతార, విఘ్నేశ్‌శివల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్న ప్రచారమే తప్ప వారిద్దరూ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇటీవలే నయనతార డేర్‌ చేసి నా కాబోయే భర్తకు ధన్యవాదాలు అంటూ బహిరంగంగా విఘ్నేశ్‌శివతో తన బంధాన్ని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు చాలా విషయాలు జరిగాయన్నదే తాజా సమాచారం. నయనతారకు విఘ్నేశ్‌శివకు ఇటీవల కేరళలో అత్యంత రహస్యంగా వివాహ నిశ్చితార్థం జరిగిందని, ఆ వేడుకను ఎంజాయ్‌ చేయడానికే ఈ జంట అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది. అయితే నయనతార, విఘ్నేశ్‌శివల వివాహ నిశ్చితార్థం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యనే జరిగిందట. 

మరో విషయం ఏమిటంటే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుంటున్న నయనతార త్వరలో నటనకు గుడ్‌బై చెప్పేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. అవును ఇప్పటికే నయనతార, విఘ్నేశ్‌శివలకు అర్ధ పెళ్లి జరిగిపోగా నవంబర్‌లో ఈ ప్రేమజంట పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. వివాహానంతరం నయనతార నటనకు టాటా, బైబై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో నిజం ఎంత అన్నది తెలియాలంటే  ఈ సంచలన జంట కల్యాణ ఘడియల వరకూ ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement