చిత్ర విచిత్రమైన రంగం సినిమా అంటారు. ఇది ఎప్పడు ఎవరిని పెకైత్తుతుందో, ఎవరిని కిందపడేస్తుందో తెలియదు. తారల ప్రవర్తనా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. నటి లక్ష్మీమీనన్ విషయానికొస్తే కుంకీ చిత్రం కోలీవుడ్‌లో తన భవిష్యత్‌కు పునాదులు వేస్తుందని తనే ఊహించి ఉండరు. ఆ చిత్రంలో కొంచెం బొద్దుగా ఉన్నా లక్ష్మీమీనన్‌ను తమిళ ప్రేక్షకులు ఆదరించారు. దీంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలాంటి సమయంలో కాస్త లావుగా ఉన్నావు బరువు తగ్గమ్మా అన్న సన్నిహితుల హితవును ఖాతరు చేయలేదు.
పైగా నేనింతే, సన్నబడడానికి కసరత్తులు చేయను, నోరు కట్టుకోను, నచ్చింది లాగించేస్తాను అని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. అందుకే ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుందంటారు. లక్ష్మీమీనన్‌కు పెద్దగా ఫ్లాప్‌లు లేవు. అయినా అంతగా అవకాశాలూ లేవు. ఈ పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణం కావచ్చు. ఆ మధ్య మంచి ప్రైమ్ టైమ్‌లో ఉండగా చదువు ముఖ్యం అంటూ నటనకు గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత వేదాళం చిత్రంలో చెల్లెలిగా నటించారు. ఆ చిత్రం హిట్ అయినా లక్ష్మీమీనన్ దాన్ని ప్లస్సో, మైనస్సో అని బేరీజు వేసుకునే లోపలే అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ఆ తరువాత అడపాదడపా అవకాశాలు రావడంతో లక్ష్మీమీనన్ పునరాలోచనలో పడ్డారని సమాచారం. ఆ మధ్య జయంరవితో మిరుదన్ చిత్రంలో నటించిన ఈ భామ ప్రస్తుతం విజయసేతుపతికి జంటగా రెక్క చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో జీవాతో నటించనున్న చిత్రం మినహా మరేమీ లేవు. దీంతో గత వైభవాన్ని చేజిక్కించుకోవడానికి దారులు వెతికుతున్న లక్ష్మీమీనన్ అందుకు అందాలు పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.
గ్లామర్ విషయంలోనూ తన పంథా మార్చుకోవాలని భావించిన ఈ కేరళకుట్టి తాజాగా స్లిమ్‌గా తయారవడానికి తన మాతృగడ్డపై ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద చికిత్సను ఎంచుకున్నారట. 20 ఏళ్ల పరువంలోకి ఎంటరైన లక్ష్మీమీనన్ ఇకపై తనలో కొత్త అందాలను చూస్తారంటున్నారు.
నాలో కొత్త అందాలు చూస్తారు
Published Sat, Sep 3 2016 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement