ఆ ముగ్గురితో భలే మంచి అనుభవం : నటి | heroine Kajal Agarwal acting in the movie Merasil | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురితో భలే మంచి అనుభవం : నటి

Jul 6 2017 7:10 PM | Updated on Oct 30 2018 5:58 PM

ఆ ముగ్గురితో భలే మంచి అనుభవం : నటి - Sakshi

ఆ ముగ్గురితో భలే మంచి అనుభవం : నటి

దక్షిణాదిలో అదృష్టవంతులైన ముద్దుగుమ్మల్లో నటి కాజల్‌ ఒక్కరని చెప్పడం అతిశయోక్తి కాదు.

దక్షిణాదిలో అదృష్టవంతులైన ముద్దుగుమ్మల్లో నటి కాజల్‌అగర్వాల్‌ ఒక్కరని చెప్పడం అతిశయోక్తి కాదు. అన్ని భాషల్లో కలిసి దశాబ్దకాలంలో అర్థశత చిత్రాలను పూర్తి చేస అరుదైన మైలురాయిని దాటిన కథానాయకి కాజల్‌అగర్వాల్‌. నేటికీ ప్రముఖ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ కోలివుడ్‌లో ఏకకాలంలో స్టార్‌ నటులు అజిత్‌, విజయ్‌లతో రీల్‌ రొమాన్స్‌ చేస్తుండడం విశేషమే అవుతుంది.  విజయ్‌కు జంటగా ఇప్పటికే తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించారు. తాజాగా మెరసిల్‌ చిత్రంలో జత కడుతున్నారు.

 

కాజల్‌ అజిత్‌తో తొలిసారిగా వివేగం చిత్రంలో నటిస్తోంది. ఇంతకు ముందే నటుడు సూర్యతో కలిసి మాట్రాన్‌ చిత్రంలో నటించారు. ఈ ముగ్గురి గురించి ఈ అమ్మడి అభిపరాయలేమిటో చూద్దాం. అజిత్‌ సెట్‌లో అందరితో చాలా ప్రేమగా, గౌరవంగా ఉంటారు. ఎవరికీ ఉచిత సలహాలు లాంటివి ఇవ్వరు. అయితే అజిత్‌ను గమనిస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అజిత్‌ బిరియానీ అందరికీ స్పేషల్‌. ఆయన నాకు బిరియానీ వండి పెట్టారు. అబ్బ ఎంతో బాగుందో !

విజయ్‌ కఠిన శ్రమజీవి. సెట్‌లో చాలా శాంతంగా ఉంటారు. కెమెరా ముందుకు వెళ్లారంటే అందరూ అబ్బురపడాల్సిందే. అంత అంకిత భావంతో నటిస్తారు. ఇక జయాపజయాలను తలకెక్కించు కోకుండాలన్నది విజయ్‌ నుంచి నేర్చుకోవాలని కాజల్‌ చెప్పారు.సూర్య చాలా అద్భుత నటుడు. పాత్రగా మారడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఈ ముగ్గురు స్టార్‌ నటులతో కలిసి నటించడం భలే మంచి అనుభవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement