జాన్వీకి నచ్చిన హీరో తెలుసా?

Heroine Jhanvi Kapoor Acts In Dhadak Bollywood movie - Sakshi

సాక్షి, చెన్నై: వర్ధమాన హీరోయిన్‌ జాన్వీ. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది అతిలోక సుందరి శ్రీదేవి. తమిళం, తెలుగు, హిందీ ఈ మూడు భాషల్లోనూ నంబర్‌వన్‌ హీరోయిన్‌గా రాణించింది శ్రీదేవి. ఆమె వారసురాలుగా పెద్ద కూతురు జాన్వీ తెరంగేట్రం చేసింది. శ్రీదేవి కోలీవుడ్‌లో నటనకు శ్రీకారం చుట్టగా, జాన్వీ బాలీవుడ్‌లో పరిచయం కానుంది. హీరోయిన్‌ జాన్వీ తనకు ఇష్టమైన హీరో ధనుష్‌ అని చెప్పింది.
 
భవిష్యత్‌లో దక్షిణాది చిత్రాల్లో నటిస్తుందో? లేదో? వేచి చూడాలి. జాన్వీ నటించిన తొలి హిందీ చిత్రం ‘దడాక్‌’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కోసం సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందనే చెప్పాలి. అలాంటి ‘దడాక్‌’ చిత్రం జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో జాన్వీ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చిత్ర దర్శకుడు కరణ్‌ జోహార్‌ ఒక పత్రిక కోసం జాన్వీని ఇంటర్వ్యూ చేశారు. 

ఆ సందర్భంగా ఆమె పలు విషయాలను పంచుకున్నారు. చివరిగా ఉత్తరాది, దక్షిణాదిలో మీకు నచ్చిన హీరో ఎవరని ప్రశ్న అడిగారు. జాన్వీ మాత్రం టక్కున హీరో ధనుష్‌ అని చెప్పింది. ధనుష్‌ చిత్రాలు, ఆయన నటన తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పడం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top