ఒక హీరో.. ఐదుగురు హీరోయిన్లు

Hero Prince and Sushanth Reddy New Movie - Sakshi

‘బస్‌ స్టాప్‌’ ఫేమ్‌ ప్రిన్స్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. స్వీయదర్శకత్వంలో ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’ చిత్రాన్ని రూపొందించిన ఎ. సుశాంత్‌ రెడ్డి ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. అతి త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. దర్శక–నిర్మాత సుశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కనున్న చిత్రమిది. తెలుగులో ‘బిగ్‌ బాస్‌ 1’లో పాల్గొన్న ప్రిన్స్‌ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ అభిమానం సంపాదించుకున్నాడు. మంచి కథల కోసం వెయిట్‌ చేస్తోన్న తనకు ఈ కథ గ్రాండ్‌ రీ–లాంచింగ్‌గా ఉండబోతోంది.

ఈ చిత్రం కోసం మేకోవర్‌ అయ్యాడు. సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్‌ హీరోయిన్‌ కనిపించనున్నారు. ఆ హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. లఢక్, గోవా, హైదరాబాద్‌తో పాటు వారణాసి ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వి. కృష్ణారావు కొల్లూరి, బ్యానర్‌: సోరింగ్‌ ఎలిఫెంట్, కెమెరా: సామల భాస్కర్, సంగీతం: హరి గౌర, సహ నిర్మాతలు: పొనుగుమాటి దిలీప్‌ కుమార్, నేతి పద్మాకర్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top