‘టాక్సీవాలా’కు మద్దతుగా..! | Hero Nikhil Comments on Vijay Devarakonda Taxiwaala | Sakshi
Sakshi News home page

Nov 15 2018 10:10 AM | Updated on Nov 15 2018 1:54 PM

Hero Nikhil Comments on Vijay Devarakonda Taxiwaala - Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. ఎస్‌కేఎన్‌ నిర్మాతగా రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌ కు ముందే లీకై యూనిట్ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. నిర్మాతలు పైరసీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది.

దీంతో టాక్సీవాలాకు మద్దతుగా ఇండస్ట్రీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. యంగ్ హీరో నిఖిల్‌ పైరసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో మేసేజ్‌ను పోస్ట్‌ చేశారు. టాక్సీవాలా చిత్ర సినిమాటోగ్రాఫర్‌ మెసేజ్‌పై స్పందించిన నిఖిల్, ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా రిలీజ్‌ కు ముందే లీకైతే గుండె పగిలినంత బాధకలుగుతుంది.

ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు టాక్సీవాలాకు జరిగింది. తరువాత నా సినిమాకు కూడా జరగొచ్చు అందుకే అందరూ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాక్సీవాలా విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement