పవన్ పాట.. ఇవాంక కోసం! | Hero Navadeep post a tweet on Ivanka trump | Sakshi
Sakshi News home page

పవన్ పాట.. ఇవాంక కోసం!

Nov 28 2017 6:57 PM | Updated on Mar 22 2019 5:33 PM

Hero Navadeep post a tweet on Ivanka trump - Sakshi

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గారాల పట్టి ఇవాంక అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు కోసం నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇవాంక రాకతో హైదరాబాద్‌లో ఉదయం భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. దీంతో హీరో నవదీప్‌ వెంటనే ‘అజ్ఞాతవాసి’  పాటను గుర్తు చేసుకున్నాడు. ఆమెకు.. ఆ పాటకు ఏం సంబంధం అనుకుంటున్నారా ?

నగరంలో ఇవాళ ఉదయం 10 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.  అందులో చిక్కుకున్న నవదీప్‌ వెంటనే తన ట్విట్టర్‌ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. ‘బయటికెళ్లి చూస్తే టైం ఏమో 10’O క్లాక్’‌. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంక రోడ్డు బ్లాక్‌’ అని ట్రాఫిక్‌ కష్టాల గురించి హీరో ఫన్నీగా ట్విట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement