రిజల్ట్‌ కోసం వెయిటింగ్‌ | HBD-Hacked By Devil Movie | Sakshi
Sakshi News home page

రిజల్ట్‌ కోసం వెయిటింగ్‌

Feb 2 2018 12:17 AM | Updated on Feb 2 2018 12:17 AM

HBD-Hacked By Devil Movie - Sakshi

మేఘన, సల్మాన్, సంతోషి

మేఘన, సంతోషి, సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్‌ దర్శకత్వంలో హారర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాక్‌డ్‌ బై డెవిల్‌’ (హెచ్‌బిడి). ఉదయ్‌భాస్కర్‌. వై నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో కృష్ణకార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘హెచ్‌బిడి’ నా మొదటి సినిమా. చాలా ఉద్వేగంతో ఉన్నా. పరీక్ష రాసి రిజల్ట్‌ కోసం ఎదురు చూస్తున్నా. మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కృష్ణకార్తీక్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు.

ఆయనకి ఇది తొలి చిత్రమైనా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు టి.రామ సత్యనారాయణ, రాజ్‌ కందుకూరి, సాయి వెంకట్, కేంద్ర మాజీ  మంత్రి సర్వే సత్యనారాయణ, ఉప్పల్‌ ఎమ్మెల్యే ప్రభాకర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్‌ యం.యం, కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వినయ్‌ గౌడ్‌ వై.

Advertisement
 
Advertisement
Advertisement