టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌.. టీజర్‌ రిలీజ్ | Cult Producer SKN Launches Teaser for Missing Meghana Movie | Sakshi
Sakshi News home page

Missing Meghana Teaser: టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌.. టీజర్‌ రిలీజ్

Aug 20 2026 9:23 PM | Updated on Aug 20 2026 9:23 PM

Cult Producer SKN Launches Teaser for Missing Meghana Movie

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ మిస్సింగ్ మేఘన. ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ చేతుల మీదుగా మిస్సింగ్ మేఘన టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ మూవీకి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు వాచస్పతి  మాట్లాడుతూ..' చిన్న సినిమాలకు ప్రమోషన్స్ చేయాలని అందరూ ముందుకు రారు.. అలాంటిది అడగగానే ఒప్పుకొని మా టీజర్ లాంఛ్ చేసినందుకు మా టీమ్ తరపున నిర్మాత ఎస్‌కేఎన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు..  ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన వీవీ వినాయక్, పిల్లా.. పిల్లా సాంగ్ లాంఛ్ చేసిన సురేష్ బాబుకు మరోసారి థాంక్స్ చెబుతున్నా.' అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement