వర్మకు హేట్సాఫ్ | hats off to Ramgopal Varma : Mohan Babu | Sakshi
Sakshi News home page

వర్మకు హేట్సాఫ్

Mar 10 2014 12:49 AM | Updated on Sep 2 2017 4:31 AM

వర్మకు హేట్సాఫ్

వర్మకు హేట్సాఫ్

‘‘సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ రషెస్ చూశాను. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వ ప్రతిభ, సాంకేతికంగా అతనికున్న అపారమైన అవగాహనకు హేట్సాఫ్.

 ‘‘సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ రషెస్ చూశాను. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వ ప్రతిభ, సాంకేతికంగా అతనికున్న అపారమైన అవగాహనకు హేట్సాఫ్. మంచి ఆరోగ్యంతో తను నిండు నూరేళ్లు బతకాలి’’ అని మోహన్‌బాబు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓ నటుడు ఎంత సంతృప్తి చెంది ఉంటే ఈ విధంగా అని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు నటించిన చిత్రం ‘రౌడీ’. ఇందులో విష్ణు కూడా నటించారు. భిన్న ధ్రువాల్లాంటి మోహన్‌బాబు, రామ్‌గోపాల్ వర్మ కలిసి ఓ సినిమా  చేస్తారని ఎవ్వరూ ఊహించరు. అందుకే, ‘రౌడీ’ చిత్రం ప్రకటించినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసి, ఆశ్చర్యపోయారు.
 
  మోహన్‌బాబు సరికొత్త లుక్‌లో కనిపించడం, ఆయన కళ్లల్లో ఫైర్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. పైగా, ప్రచార చిత్రంలో ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది... వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది’ అనే డైలాగ్ ‘రౌడీ’పై మరింత హైప్ పెరిగేలా చేసింది. ఎప్పుడు ప్రారంభించారో ఎప్పుడు పూర్తి చేశారో ఎవరికీ తెలియనంత వేగంగా ఈ షూటింగ్ పూర్తి చేశారు. పార్ధసారథి, గజేంద్ర, విజయ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. పాటలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మోహన్‌బాబు సరసన జయసుధ, విష్ణు సరసన శాన్వీ నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: సతీష్.
 

Advertisement
 
Advertisement
Advertisement