హిజ్రాలు కూడా మ‌హిళ‌లే: న‌టి | Harry Potter Actress Bonnie Wright Says Transwomen Are Women | Sakshi
Sakshi News home page

హిజ్రాలంటే నాకిష్టం: న‌టి

Jun 12 2020 3:43 PM | Updated on Jun 12 2020 4:14 PM

Harry Potter Actress Bonnie Wright Says Transwomen Are Women - Sakshi

హ్యారీపోట‌ర్ సిరీస్‌లో క‌నిపించిన‌ న‌టి బోనీ రైట్  ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ట్వీట్ చేసింది. "హ్యారీపోట‌ర్ ప్రేమ‌కు మూల‌మైతే.. ఆ అనంత‌మైన ప్రేమ నీతోపాటు అంద‌రికీ ఎలాంటి తార‌త‌మ్యాలు లేకుండా అందాల్సిందే. ఎందుకంటే ట్రాన్స్‌జెండ‌ర్లు కూడా మ‌హిళ‌లే.. వారిని నేను ఎంత‌గానో ప్రేమిస్తున్నాను" అంటూ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది. కాగా 'హ్యారీపోట‌ర్' చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జేకే రౌలింగ్ ట్రాన్స్‌జెండ‌ర్ల‌పై వివాదాస్ప‌ద ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. అది హిజ్రాల‌కు వ్య‌తిరేకంగా ఉండటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఆమె వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు తీవ్రంగా ఖండించారు. (డేంజర్‌లో హలీవుడ్‌)

వీరితోపాటు "హ్యారీపోట‌ర్" సిరీస్‌లో న‌టించిన ప‌లువురు న‌టీన‌టులు కూడా ఆమె వాద‌న‌ను ఖండిస్తూ ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క‌రూ కూడా జేకే రౌలింగ్ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా వాట్స‌న్‌ ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. హిజ్రాలకు సాధార‌ణంగా జీవించే హ‌క్కు ఉంద‌ని తెలుపుతూ వారికోసం పాటుప‌డే సంస్థ‌ల‌కు విరాళం అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.‌ (అదే తేదీకి అవతార్‌!)

Advertisement
 
Advertisement
Advertisement