‘సీటీమార్‌’ అంటున్న యంగ్ డైరెక్టర్‌ | harish shankar next movie seeti maar | Sakshi
Sakshi News home page

Feb 22 2018 11:12 AM | Updated on Feb 22 2018 1:08 PM

Director Harish Shankar - Sakshi

దర్శకుడు హరీష్‌ శంకర్‌

డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో భారీ వసూళ‍్లు సాధించిన యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌, ప్రస్తుతం మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న దాగుడు మూతలు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా హరీష్ కన్ఫామ్ చేశాడు. దిల్ రాజు నిర్మిస్తున్న దాగుడుమూతలు పూర్తయిన వెంటనే ఓ యంగ్ హీరోతో ‘సీటీమార్’ పేరుతో ఓ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నాడు హరీష్‌.

ఈ సినిమాను అరుణాచల్‌ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ నిర్మించనున్నారు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే సినిమాలోని సూపర్‌ హిట్ పాట పల్లవినే తన కొత్త సినిమాకు టైటిల్‌గా ఫిక్స్‌ చేశాడు దర్శకుడు. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్‌లుగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్‌ టాక్‌ పరంగా నిరాశపరిచినా కలెక్షన్ల విషయంలో మాత్రం సత్తా చాటింది.

Advertisement
 
Advertisement
Advertisement