మావాడికి పెళ్లి కుదిరింది | Happy Wedding Trailer launch | Sakshi
Sakshi News home page

మావాడికి పెళ్లి కుదిరింది

Jul 1 2018 1:40 AM | Updated on Jul 1 2018 8:54 AM

Happy Wedding Trailer launch - Sakshi

ఎమ్మెస్‌ రాజు, ప్రమోద్, వంశీ, నిహారిక, సుమంత్‌ అశ్విన్, లక్ష్మణ్‌ కార్య

‘మాకు బంధువులు ఎక్కువేగానీ పనులకు ఎవరూ రారు’ అనే డైలాగ్‌తో ‘హ్యాపి వెడ్డింగ్‌’ సినిమా ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘మీ అబ్బాయిలంతా ఇంతేనా.. మేం కన్‌ఫామ్‌ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు’ అంటూ సుమంత్‌ అశ్విన్‌ని నిలదీస్తున్నారు నిహారిక. ‘మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్‌.. ఏం చేసినా చాలా రొమాంటిక్‌గా చేస్తారు’ అని నిహారికతో అంటున్నారు సుమంత్‌ అశ్విన్‌. టోటల్‌గా ‘హ్యాపి వెడ్డింగ్‌’ ట్రైలర్‌లో పెళ్లి సందడి కనిపించింది. సుమంత్‌ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని అందంగా చూపించాం. ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్‌ కార్య. ‘‘నిహారిక బాగా నటించారు. నా కెరీర్‌కి ఈ సినిమా మంచి హెల్ప్‌ అవుతుందనుకుంటున్నా’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ‘‘యూవీ క్రియేషన్స్‌లో మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు నిహారిక. ఈ సినిమాకు సమర్పణ: యూవీ క్రియేషన్స్, సంగీతం: శక్తికాంత్, రీ–రికార్డింగ్‌: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: బాల్‌రెడ్డి, నిర్మాత: పాకెట్‌ సినిమా.

Advertisement
 
Advertisement
Advertisement