హీరోయిన్ ఆనందం రెండు మిలియన్లు! | hansika Uphold for 2Million Followers on twitter | Sakshi
Sakshi News home page

హీరోయిన్ ఆనందం రెండు మిలియన్లు!

May 17 2016 12:10 PM | Updated on Aug 28 2018 4:30 PM

హీరోయిన్ ఆనందం రెండు మిలియన్లు! - Sakshi

హీరోయిన్ ఆనందం రెండు మిలియన్లు!

టాలీవుడ్ బొద్దుగుమ్మ హన్సిక ఆనందం రెండు మిలియన్ల అయింది.

హైదరాబాద్/చెన్నై: టాలీవుడ్ బొద్దుగుమ్మ హన్సిక ఆనందం రెండు మిలియన్ల అయింది. అదేంటి ఆనందం రెండింతలు, మూడింతలు అవ్వాలి కానీ మిలియన్ల అవ్వడం ఏంటనుకుంటున్నారా?. అయితే ఆ వివరాలు ఎంటన్నది ఓ లుక్కేద్దాం మరి. సోషల్ మీడియా ట్విట్టర్ లో సెలబ్రిటీలు, అందులో ముఖ్యంగా హీరోయిన్లు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య మూవీ ప్రమోషన్లను, తమ సంతోషకర క్షణాలను ట్వీట్లతోనే చెబుతున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో ఫాలోయర్లు ఇరవై లక్షల మందికి చేరుకున్నారని హన్సిక అడిక్ట్ అకౌంట్లో ట్వీట్ చేశారు. తన ఆనందం రెండు మిలియన్లు అయిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఫొటో పోస్ట్ ను హన్సిక్ రీట్వీట్ చేసింది.

'కోయి మిల్ గయా'తో బాలనటిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మిల్కీ భామ హన్సిక... 'దేశముదురు'తో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత ఆడపాదడపా మూవీలు చేసిన హన్సిక ప్రస్తుతం కోలీవుడ్ లో క్వీన్ గా వెలుగుతుంది. తెలుగు మూవీ ఇష్క్ ను తమిళంలో దర్శకుడు ఏఆర్.రాజశేఖర్ రీమేక్ చేస్తున్నాడు. ఆమెకు జంటగా సీనియర్ నటి జయప్రద కుమారుడు సిద్ధు హీరోగా పరిచయం అవుతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement