అక్కడే ఏదో జరిగింది! | Hansika React on Her Mobile Phone Hack | Sakshi
Sakshi News home page

అక్కడే ఏదో జరిగింది!

Feb 2 2019 11:35 AM | Updated on Feb 2 2019 11:35 AM

Hansika React on Her Mobile Phone Hack - Sakshi

సినిమా: అక్కడే ఏదో జరిగింది అని అంటోంది నటి హన్సిక. దక్షిణాదిలో కథానాయకిగా పలు చిత్రాలు చేసిన నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు. ధనుష్‌కు జంటగా మాప్పిళై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ముంబై బ్యూటీ ఆ తరువాత విజయ్, విశాల్, జయం రవి,శింబు, ఆర్య అంటూ స్టార్‌ హీరోలందరితోనూ నటించేసింది.అంతేకాదు ఇక్కడ చిన్న కుష్బూగా గుర్తింపు పొందిన హన్సిక నటిగా అన్ని భాషలు కలిపి అర్ధ సెంచరీ కొట్టేసింది. ఈ అమ్మడు నటిస్తున్న 50వ చిత్రం మహా. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్ల వ్యవహారంలో కాస్త విమర్శలను ఎదుర్కొన్న హన్సిక వాటిని ఫ్రీ ప్రచారంగా వాడుకునే ప్రయత్నం చేసింది. అయితే అసలు సమస్య మహా చిత్ర విడుదల సమయంలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

ఆ విషయం పక్కన పెడితే ఇటీవల హన్సిక అంతరంగిక ఫొటోలు ఇంటర్నెట్‌లో విడుదలై కలకలం సృష్టించాయి. అవకాశాలు పలచబడడంతో ఈ అమ్మడే ఫ్రీ పబ్లిసిటీ కోసం ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తన ఫోన్‌ను, ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని నటి హన్సిక పేర్కొంది. ఇటీవల తాను అమెరికా వెళ్లానని, అప్పుడు తన ఫోన్‌ సరిగా పనిచేయలేదని  అప్పుడే ఏదో జరిగి ఉంటుందని పేర్కొంది. అంతేకానీ ప్రచారం కోసం అలాంటి ఫొటోలను తానేందుకు వాడుకుంటానని అంది. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మ ఆంతరంగిక ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విడుదలై కలకలం సష్టించిన మాట వాస్తవం. దానికి కారణం ఎవరన్న విషయంపై విచారణ జరుగుతోందని నటి హన్సిక అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement