అమ్మ కోసం హన్సిక... | hansika mother got new hairstylist | Sakshi
Sakshi News home page

అమ్మ కోసం హన్సిక...

Oct 19 2015 10:05 AM | Updated on Sep 3 2017 11:12 AM

అమ్మ కోసం హన్సిక...

అమ్మ కోసం హన్సిక...

హిరోయిన్ హన్సిక హెయిర్ స్టయిలిస్ట్గా మారిపోయింది. అంటే ప్రొఫెషనల్ హెయిర్ స్టయిలిస్ట్గా కాదు లేండీ.. ఏదో టైం పాస్ కోసం.

హీరోయిన్ హన్సిక హెయిర్ స్టయిలిస్ట్గా మారిపోయింది. ఇదేంటబ్బా అనుకుంటున్నారా?....  అంటే ప్రొఫెషనల్ హెయిర్ స్టయిలిస్ట్గా కాదు లెండీ.. అది కూడా అమ్మ కోసం... ఆమె హెయిర్ స్టయిలిస్ట్గ్గా అవతారమెత్తింది.  ఓ సినిమా షూటింగ్కు హన్సికతో పాటు వచ్చిన ఆమె తల్లి మోనా మోత్వానీ కూడా వచ్చారు.

'పోకిరి రాజా'  షూటింగ్ సమయంలో గ్యాప్ వచ్చింది. అంతే హన్సిక పార్ట్ టైమర్గా మారింది. సరదాగా అమ్మకు జడ అల్లుతూ తన ముచ్చట తీర్చుకుంది. ఆ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.  మా అమ్మకు కొత్త హెయిర్ స్టయిలిస్ట్ దొరికిందంటూ... ఫోటోతో పాటు కామెంట్ పోస్ట్ చేసిన హన్సిక.. అమ్మ అంటే తనకు ఎంతో ప్రేమ అని తెలిపింది.

కాగా హన్సిక ప్రస్తుతం పోకిరి రాజా సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అయితే  షూటింగ్ గ్యాప్లో ఆ చిత్ర హీరో జీవాతో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేసుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ షాట్ రెడీ అని వారిద్దర్ని పిలిచినా... ఓకే అంటూనే ఫస్ట్ సెల్ఫీ ఆ తర్వాత షాట్ అంటూ ...హంగామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement