కత్తి యుద్ధానికి సై అంటుంది | Hansika learns sword fighting  | Sakshi
Sakshi News home page

కత్తి యుద్ధానికి సై అంటుంది

Dec 7 2014 3:37 PM | Updated on Sep 2 2017 5:47 PM

కత్తి యుద్ధానికి సై అంటుంది

కత్తి యుద్ధానికి సై అంటుంది

ప్రముఖ నటి హన్సిక కత్తి పట్టుకుని కదనరంగంలోకి దూకి శత్రువులపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది.

ప్రముఖ నటి హన్సిక కత్తి పట్టుకుని కదనరంగంలోకి దూకి శత్రువులపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం క్షణం తీరిక లేకుండా ఆమె కత్తి యుద్ధాన్ని ప్రాక్టీసు చేస్తుంది. హాంకాంగ్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటుందని సమాచారం. విజయ్ హీరోగా హన్సిక, శ్రీదేవిలతో ఫాంటసీ నేపథ్యంతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చకచక సాగుతుంది. ఆ చిత్రంలో హన్సిక యువరాణి పాత్ర పోషిస్తుంది. కత్తి పట్టుకుని యుద్ధం చేయడం తనకు ఎంతో ఎక్సైటింగ్గా ఉందని హన్సిక ట్విట్ చేసింది.

శింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే అంబాలాలో కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొంత భాగం పొలాచ్చిలో షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత చెన్నైలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలోని పాటలు, కొన్ని సన్నివేశాలను జోర్డాన్, ఇటలీ, జర్మనీ దేశాలలో చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. చిత్రసీమలోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని శింబు దేవన్ సంకల్పంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement